నెల్లూరు: మద్యం మత్తులో దాడి

63చూసినవారు
నెల్లూరు: మద్యం మత్తులో దాడి
మద్యం తాగి వచ్చి తనపై దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు. నెల్లూరు చాకలివీధిలో నివాసం ఉంటున్న శ్రీలత, వరుణ్ రెండేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. వరుణ్ ఇటీవల మద్యం తాగి వచ్చి నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. లేదంటే దాడికి పాల్పడుతున్నాడు. మద్యం తాగి శ్రీలతపై దాడికి పాల్పడ్డాడు. రక్తగాయాలతో ఆమె ప్రభుత్వాస్పత్రికెళ్లి చికిత్స చేయించుకున్నారు.

సంబంధిత పోస్ట్