గణేష్ ఉత్సవాల అనుమతులను సులభతరం చేసేందుకు సింగల్ విండో విధానాన్ని అవలంభిస్తున్నట్లు జిల్లా ఎస్పి. కృష్ణకాంత్ పేర్కొన్నారు. నెల్లూరులో ఆదివారం ఆయన మాట్లాడుతూ,వినాయక ఉత్సవాలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి సింగిల్ విండో విధానంతో సులభతరం చేసిందన్నారు. అగ్నిమాపక, పురపాలక, విద్యుత్, పోలీసు శాఖల చుట్టూ తిరగకుండా ఈ విధానం ఉపయోగించుకోవాలన్నారు.