లైసెన్స్ ఆధారంగా వాహన మిత్ర పథకాన్ని అమలు చేయాలని కోరుతూ శుక్రవారం నెల్లూరు నగరంలోని స్టౌన్ హౌస్ పేట నుండి ఆత్మకూరు బస్టాండ్ వరకు ఆటో కార్మికులు సిఐటియూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సిఐటియు నగర కార్యదర్శి జి. నాగేశ్వరరావు మాట్లాడుతూ బ్యాడ్జితో నిమిత్తం లేకుండా లైసెన్స్ ఆధారంగా వాహన మిత్ర పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఆటో కార్మికుల పై అధిక పెనాల్టీలు వసూలు చేయడం ఆపాలన్నారు.