నెల్లూరు రూరల్ పరిధిలోని సౌత్ మోపూర్ గ్రామంలో శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నోట్ బుక్, టెక్స్ట్ బుక్స్, బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సౌత్ మోపూర్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, పముజుల దశరథ రామయ్య, సర్పంచ్ తిరువీధుల పోలయ్య తదితరులు పాల్గొన్నారు.