చెక్ పోస్ట్ వద్ద లక్ష రూపాయలు స్వాధీనం

66చూసినవారు
చెక్ పోస్ట్ వద్ద లక్ష రూపాయలు స్వాధీనం
మనుబోలులోని అంతర్ జిల్లా చెక్పోస్ట్ వద్ద ఎటువంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు. బుధవారం యస్ ఐ మధ్యాహ్నం చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బస్సులో చెన్నై నుండి నెల్లూరు కి వెళ్తున్న నెల్లూరుకు చెందిన పర్మశాల్ విక్రమ్ వద్ద ఎటువంటి రసీదులు లేకుండా నగదు ఉండడాన్ని గుర్తించి సీజ్ చేశారు.