సోమశిల- కండలేరు జలాశయంలో నీటిని త్రాగునీటి అవసరాలకే వినియోగించాలని బిజెపి జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు అన్నారు. మనుబోలు లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూగర్భ జలాలు అడుగంటి పోతువున్నయి. చెరువులలో నీరు నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయన్నారు.
జిల్లా అధికారులు నియోజకవర్గంలోని చెరువులకు మాత్రం సమృద్ధిగా నీటి నిల్వలు నింపారన్నారు. సోమశిల డెడ్ స్టోరేజీ చేరుకుందన్నారు.