వరదయ్యపాలెంలో ఈనెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి దేవాలయ తిరునాళ్లు జరగనున్నాయి. ఈక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని దేవాంగ కార్పొరేషన్ డైరక్టర్ బొప్పన తిలక్ బాబు, టీడీపీ నేత పన్నెం నిర్మల్ శుక్రవారం కలిశారు. ఉత్సవ పత్రికను అందజేసి ఆహ్వానించారు. తిరునాళ్లకు వస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.