శ్రీకాళహస్తి పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జనసేన పార్టీ పటిష్టం అయ్యేలా కృషి చేద్దామని నియోజకవర్గం ఇంచార్జ్ వినుతకోట తెలిపారు. ఇటీవల నిర్వహించిన నాలుగో విడత సభ్యత్వం నమోదుకు నియోజకవర్గంలో మంచి స్పందన లభించినట్టు ఆమె చెప్పారు. దీనిని విజయవంతం చేసిన వాలంటరీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.