శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అనుబంధమైన నీలకంటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీ నీలకంఠేశ్వర స్వామి అన్నపూర్ణ అమ్మవారిని మంగళ వాయిద్యాలతో మేళ తాళాలతో పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతి సమర్పించారు.