నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి గురువారం ఎమ్మార్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి ఎస్సీ వర్గీకరణ పై ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటం ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచిపెట్టారు. నాయకులు వాసు, రవి, శ్రీనివాసులు, గంగమంగ రవి, హజరత్, శ్రీనివాసులు, చంద్రబాబు, వీరరాఘవలు పాల్గొన్నారు.