తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె. శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జయవిజయులకు, గరుడాళ్వారుకు,
విష్వక్సేనులవారికి, ధ్వజస్తంభానికి పవిత్రమాలలు సమర్పించారు.