శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘ‌నంగా తులసి మహత్యం ఉత్సవం

82చూసినవారు
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘ‌నంగా తులసి మహత్యం ఉత్సవం
తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం తులసి మహత్యం ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉద‌యం స్వామివారిని సుప్ర‌భాతంతో మేల్కొలిపి, ద‌ర్శ‌నం క‌ల్పించారు. అనంతరం శ్రీగోవిందరాజస్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను క‌టాక్షించారు.

సంబంధిత పోస్ట్