సచివాలయం సిబ్బంది 100% హాజరు వేయాలి

52చూసినవారు
సచివాలయం సిబ్బంది 100% హాజరు వేయాలి
సచివాలయ సిబ్బంది 100% హాజరు తప్పనిసరి వేయాలని ఉదయగిరి ఎంపీడీవో డి. ఈశ్వరమ్మ తెలిపారు. మంగళవారం మండలంలోని 12 సచివాలయాల సిబ్బందితో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఉదయం 10: 00 లోపు సచివాలయానికి తప్పనిసరిగా హాజరై బయోమెట్రిక్ 100% ఉండేలా చూడాలన్నారు. సాయంత్రం 5 గంటల లోపు బయోమెట్రిక్ హాజరు వేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్