ఉదయగిరి పట్టణంలోని కరీమా వీధిలో ఫీవర్ కేసులపై గండిపాలెం పిహెచ్సి వైద్య ఆరోగ్య అధికారులు కలసపాటి వెంకటసుబ్బయ్య, షేక్. గాజుల నౌషద్ లు తమ సిబ్బందితో కలిసి ఇంటింటి సర్వే మంగళవారం చేపట్టారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం డెంగు వ్యాధి పై ప్రజలకు అవగాహన కల్పించారు. చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.