ఉదయగిరి మండల సర్వసభ్య సమావేశం ఈనెల 20వ తేదీన ఉదయం 11 గంటలకు స్థానిక శ్రీ శక్తి భవనంలో జరుగుతుందని ఎంపీడీవో దేవరకొండ. ఈశ్వరమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ మూలే పద్మజ హాజరవుతారన్నారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు తమ తమ నివేదికలతో తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరుగుతుందని తెలిపారు.