ఉదయగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారులు షేక్ మస్తాన్ వలి, తోట శ్రీనివాసులు సంయుక్తంగా బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రిజిస్టర్, రికార్డులను పరిశీలించారు. అనంతరం స్టూడెంట్ కిట్స్ గదిని తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం నాణ్యత రుచులను పరిశీలించి మధ్యాహ్నం భోజనం గ్యాస్ స్టవ్ మీద మాత్రమే చేయాలని కట్టెల పొయ్యి మీద చేయొద్దని నిర్వాహకులకు సూచించారు.