ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఆలూరు రవీంద్ర, ఉదయగిరి మండలం ఇన్ చార్జ్ సురేంద్ర ఆధ్వర్యంలో జనసైనికులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన గెలుపులో జనసైనికులు కీలకంగా వ్యవహరించారని ప్రతి ఒక్క జన సైనికుడిని గుర్తుపెట్టుకుంటానని ఎమ్మెల్యే కాకర్ల అన్నారు. వారిని ఆత్మీయంగా పలకరించారు.