ఉదయగిరి పట్టణంలోని ఈద్ గా మైదానంలో గురువారం జరిగిన రంజాన్ వేడుకలకు ఉదయగిరి నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ హాజరయ్యారు. ఉదయగిరిలోని ముస్లిం సోదరులతో కలిసి ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులు, సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి మండల టిడిపి అధ్యక్షుడు బయన్న, రియాజ్ పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.