పద్యం ద్వారా ఉపాధ్యాయ ఔన్నత్యాన్ని వివరించిన ఎంఈఓ

53చూసినవారు
ఉదయగిరి మండలం అప్పసముద్రం పాఠశాల జీవ శాస్త్ర ఉపాధ్యాయుడు ఎం. నాగేశ్వరరావు పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సన్మాన సభ నందు గురువు యొక్క ఔన్నత్యాన్ని పద్యం ద్వారా ఉదయగిరి మండల విద్యాశాఖ అధికారి-2 తోట శ్రీనివాసులు వివరించారు. గురువులు దేవుళ్ళ కంటే గొప్ప వారని, ఎందరో విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి తీర్చిదిద్దుతారని కొనియాడారు.