నేషనల్ పంచాయతీ అవార్డ్స్ నామినేషన్స్ కోసం జిల్లా పంచాయతీ అధికారి సుస్మితారెడ్డి, సీఈవో కన్నమ నాయుడు వెబ్ ఎక్స్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించారు. మంగళవారం ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయంలో వెబ్ ఎక్స్ ద్వారా జరిగిన శిక్షణ తరగతులకు ఎంపీడీవో ఈశ్వరమ్మ, ఈపిఓఆర్టి మల్లికార్జున, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు హాజరయ్యారు. అనంతరం ఐహెచ్ఎల్ సర్వే, ఓడిఎఫ్ సర్వే, పీఆర్ యాప్ గురించి అవగాహన కల్పించారు.