సచివాలయాలను తనిఖీ చేసిన ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు

68చూసినవారు
సచివాలయాలను తనిఖీ చేసిన ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు
నెల్లూరు జిల్లా కలిగిరి పట్టణంలోని బిట్- 1, 2 వెలగపాడు గ్రామ సచివాలయాలను బుధవారం ఎంపీడీవో రంగ సుబ్బారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన పలు రికార్డులు పరిశీలించి సిబ్బందికి సలహాలు సూచనలు చేశారు. సచివాలయ సిబ్బంది నూరు శాతం బయోమెట్రిక్ హాజరు వేయాలన్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే సచివాలయం సిబ్బంది డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్