జలదంకి మండల వ్యాప్తంగా వర్షం

59చూసినవారు
జలదంకి మండల వ్యాప్తంగా వర్షం
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. సుమారు అరగంట సేపు పడిన ఈ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనాన్ని కలిగించింది. వర్షాలు పుష్కలంగా పాడాలని రైతులు ఆకాంక్షిస్తున్నప్పటికీ వారికి ప్రతిసారి నిరాశ ఎదురవుతుంది.

సంబంధిత పోస్ట్