వైభవంగా ముగిసిన శ్రీ మానసా దేవి ఉత్సవాలు

77చూసినవారు
నెల్లూరు జిల్లా, వరికుంటపాడు మండలం తూర్పు రొంపి దొడ్ల గ్రామంలో శ్రీ మానసా దేవి ఉత్సవాలు నేటితో ముగిసాయి. ఇందులో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి ఆలయంలో మహిళలు కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం మేళ తాళాలతో వెళ్లి సమీపంలో ఉన్న పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్