ఉపాధ్యాయుడికి వీడ్కోలు పలికిన విద్యార్థులు

67చూసినవారు
ఉపాధ్యాయుడికి వీడ్కోలు పలికిన విద్యార్థులు
ఉదయగిరి మండలం అప్పసముద్రం జడ్పీ ఉన్నత పాఠశాలలో బయాలజీ టీచర్ మండ్ల నాగేశ్వరరావు ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మండల నాగేశ్వరరావు శ్రీదేవి దంపతులను ఆదివారం ఘనంగా సత్కరించారు. గత 30 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో విశిష్ట సేవలందించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి నాగేశ్వరరావు అని తోటి ఉపాధ్యాయులు కొనియాడారు.