సున్నం వారి చింతలలో ముగిసిన కోదండ రామస్వామి ఉత్సవాలు

54చూసినవారు
సున్నం వారి చింతలలో ముగిసిన కోదండ రామస్వామి ఉత్సవాలు
ఉదయగిరి మండలం సున్నం వారి చింతల గ్రామంలో శ్రీ కోదండరామ స్వామి ఉత్సవాలు ఆదివారంతో ముగిసాయి. చివరి రోజు స్వామివారి పార్వేట ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామంలో ఊరేగించారు. అనంతరం మహిళలు పొంగలి సామాగ్రిని ఊరికి సమీపంలోని మామిడి తోపు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పొంగళ్ళు పొంగించి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్