ఉదయగిరి ఎంపీడీవో అప్పాజీ శుక్రవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వారి జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. మండలంలో వివిధ కార్పొరేషన్ ద్వారా 30 మందికి మూడు స్లాబ్లు పద్ధతిలో రుణాలు మంజూరు అయినట్లు పేర్కొన్నారు. బీసీలకు 21, కాపు-1, ఈడబ్ల్యూఎస్-1, రెడ్డి-3, కమ్మ-2, ఆర్యవైశ్య-1, బ్రాహ్మణ-1 ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.