ఉదయగిరి: ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

52చూసినవారు
ఉదయగిరి: ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
ఉదయగిరిలోని ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలో గురువారం ప్రమాదం జరిగింది. ఉదయగిరి నుంచి బద్వేల్ వెళ్తున్న బస్సును ఎదురుగా వస్తున్న లారీ తాకుతూ వెళ్ళింది. దీంతో బస్సు డ్రైవర్ సైడ్ కొంత భాగం స్వల్పంగా దెబ్బతింది. బస్సు, లారీ డ్రైవర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానికులు వారికి సర్ధిచెప్పి పంపించారు. ఎదురెదురుగా వస్తున్న లారీ మార్జిన్ ఇవ్వకపోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్