మానసా దేవి ఆలయ అభివృద్ధికి సహకరిస్తాం: మాజీ ఎమ్మెల్యే

67చూసినవారు
మానసా దేవి ఆలయ అభివృద్ధికి సహకరిస్తాం: మాజీ ఎమ్మెల్యే
వరికుంటపాడు మండలం తూర్పు రొంపి దొడ్ల గ్రామంలో జరుగుతున్న శ్రీ మానసా దేవి బ్రహ్మోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ. చుట్టుపక్కల ఉన్న ఎన్నో గ్రామాలకు శ్రీ మానసా దేవి ఉత్సవాలు పెద్ద పండుగ అన్నారు. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యేతో మాట్లాడి పూర్తి సహకారం అందిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్