
సీతారాంపురం: ఎంపీడీవో కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా యోగేంధ్ర 2025 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీతారాంపురం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా వల్ల వచ్చే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.