రాపూరు మండలం లోని పెంచలకోన పుణ్యక్షేత్రం శుక్రవారం గోవిందా నామస్మరణతో మారుమోగింది. వరలక్ష్మీవ్రతం సందర్భంగా పెంచలకోనలోని శ్రీఆదిలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలక్ష్మి అమ్మవారి మూలమూర్తికి ఆలయ అర్చకులు అభిషేకం నిర్వహించి అనంతరం శ్రీవారి నందనవనంలోని మండపంలో ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి వరలక్ష్మీదేవిగా అలంకరించి వ్రతం చేశారు. అధిక సంఖ్యలో మహిళ భక్తులు పాల్గొని వత్రం నిర్వహించారు.