అనంతపురం జిల్లా వ్యాప్తంగా 136 నూతన ప్రైవేటు మద్యం దుకాణాలకు 3144 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా విడపనకల్లులో 111వ దుకాణానికి 51 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా తాడిపత్రి పరిధిలో 16 దుకాణాలకు కేవలం 97 దరఖాస్తు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. అయితే అనంతపురం నగరంలో 30 దుకాణాలకు 1056 దరఖాస్తులు వచ్చాయి.