అనంతపురంలో యాసిడ్ తాగిన మహిళ మృతి

64చూసినవారు
అనంతపురంలో యాసిడ్ తాగిన మహిళ మృతి
అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రెండు రోజుల క్రితం మతిస్థిమితం లేని హిందూపురంలోని సీపీఐ కాలనీకి చెందిన షాహినా అనే మహిళ యాసిడ్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం సర్వజన ఆసుపత్రికి తరలించారు. శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.