అనంతపురం జిల్లాలో జాతీయ రహదారులుకు సంబంధించి వచ్చే డిసెంబర్ నెలాఖరులోపు భూసేకరణ పనులు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టర్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. పలు సూచనలు చేశారు.