ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ఆధ్వర్యంలో ఈనెల 18న సచివాలయాల వద్ద వ్యక్తిగత అర్జీల సమర్పణ కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ తెలిపారు. అనంతపురం పట్టణంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జాపర్ తో కలిసి శనివారం కరపత్రాలు విడుదల చేశారు. వారు మాట్లాడుతూ. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల నిర్మాణానికి నిధులు పెంచాలని, విద్యుత్ ఛార్జీల పెంపు ఉపసంహరించు కోవాలన్నారు.