కిషోరి బాలికల వికాసంతోనే సమాజ సౌభాగ్యం సాధ్యమవుతుందని అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న అన్నారు. అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఐసీడీఎస్ పీడీ డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజ గతిని మార్చే శక్తి బాలికలకే సాధ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.