అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఈనెల 26వ తేదీ మహాధర్నా నిర్వహిస్తున్నామని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్. సూరి శుక్రవారం అనంతపురంలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగం, కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తదితరులు హాజరవ్వాలని కోరారు.