రైతులకు మేలు చేసేలా అధికారులు పని చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ హాల్లో బెలుగుప్ప మండలం నర్సాపురం గ్రామ పరిధిలో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణానికి 17.97 ఎకరాల విస్తీర్ణంకు సంబంధించి డి.ఎల్.ఎన్.సి సమావేశాన్ని శనివారం జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ నిర్వహించారు.