గురుకులం టీచర్ల సమస్యలను పరిష్కరించాలని డి టి వో కు జీవీఎస్ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. 15 ఏళ్లుగా అనంతపురం జిల్లాలోని గిరిజన గురుకులం రెసిడెన్షియల్ పాఠశాలలో పని చేస్తున్న టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, వారిని అలాగే కొనసాగించేలా చూడాలన్నారు. శుక్రవారం అనంతపురంలోని పెన్నార్ భవనంలో జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి రామాంజనేయులుకి వినతిపత్రం సమర్పించారు.