రాయలసీమ అభివృద్ధి చెందాలంటే శ్రీ బాగ్ ఒప్పందం అమలు చేయాలని ఓపీడీఆర్ రాష్ట్ర కార్య దర్శి రాంకుమార్ ప్రభుత్వాన్ని కోరారు. శ్రీబాగ్ ఒప్పందం దినోత్సవం సందర్భంగా శనివారం అనంతపురంలో ప్రజా సంఘాలతో కలిసి రామాచార్యులు విగ్రహం నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు.