ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు పూచిలేని సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని అనంతపురం జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రజా సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దులచెరువు మల్లి మంత్రి లోకేష్ ను కోరారు. ఈ మేరకు ఆయన మంత్రి నారా లోకేశ్ కు రాష్ట్ర రాజధాని అమరావతి లో శనివారం వినతిపత్రం ఇచ్చారు. అర్హులకు రుణాలు అందేలా చూడాలని విన్నవించారు.