మద్యం టెండర్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి బుధవారం డిమాండ్ చేశారు. బుధవారం ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్ శ్రీరామను ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం టెండర్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించాలని కోరారు. మద్య వ్యాపారం జోరుగా సాగడానికి ప్రధాన కారణం దళిత, గిరిజనులేనని అలాంటి వారికి వ్యాపార భాగస్వామ్యంలో వాటా దక్కేలా చూడాలన్నారు.