ఆర్ఎఫ్ రోడ్డులోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న శ్రీవారి బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజున గురువారం చంద్రప్రభవాహనంపై గోవిందుడు కనువిందు చేశారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, పుష్పాలంకరణ, తోమాల సేవ నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తిని చంద్రప్రభవాహనంపై ఆశీనులను చేసి, మేళతాలాలు, డప్పు వాయిద్యాలు, గోవింద నామస్మరణ నడుమ నగరోత్సవం నిర్వహించారు.