అనంతపురం జిల్లా కు చెందిన జె. మణీంద్ర తైక్వాండో జాతీయ రెఫరీగా అర్హత సాధించాడని జిల్లా తైక్వాండో సంఘం ప్రధాన కార్యదర్శి గురుస్వామి ఆదివారం మీడియాతో తెలిపారు. ఈనెల 28, 29 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించిన నేషనల్ రెఫరీ సెమినార్ లో పాల్గొని ఉత్తీర్ణత సాధించిన మనీంద్రను అంతర్జాతీయ రెఫరీ నవీన్ చంద్ర, జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షులు గోపాల్ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి శాంతరాజ్ లు అభినందించారు.