ముదిగుబ్బ మండలంలోని బీసీ బాలికల వసతి గృహంలో నీటి కష్టాలు తీర్చాలని బీసీ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో హాస్టల్లో ఆదివారం ధర్నా చేశారు. రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్వామి మాట్లాడుతూ ఈ వసతి గృహంలో దాదాపు 140 మంది విద్యార్థినులు ఉన్నారని నీటి సౌకర్యం సక్రమంగా లేక అమ్మాయిలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. చాలా మంది చదువుకు దూరమయ్యే అవకాశం ఉందని ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించాలని తెలిపారు.