ధర్మవరంలోని బెస్త వీధిలో నివాసం ఉంటున్న గోల్డ్ స్మిత్ సలీం, గౌసియా దంపతుల కుమార్తె హఫ్సా ఇంటర్ ఇంప్రూవ్మెంట్ ఫలితాల్లో 464 మార్కులు సాధించింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ మార్కులు రావడానికి కృషి చేసిన అధ్యాపకులకు విద్యార్థి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిషత్తులో ఉత్తమ ఇంజినీర్ గా సేవలు అందించడానికి కృషి చేస్తానని హఫ్స పేర్కొన్నారు.