జనసేన నేత చిలకంను కలిసిన ఆటో యూనియన్ నాయకులు

52చూసినవారు
జనసేన నేత చిలకంను కలిసిన ఆటో యూనియన్ నాయకులు
ధర్మవరం పట్టణంలోని భగత్ సింగ్ ఆటో యూనియన్ నాయకులు శనివారం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఆటో యూనియన్ నాయకులకు ఇంటి స్థలాలు ఇప్పించి న్యాయం చేస్తానని చిలకం హామీ ఇచ్చారని తెలిపారు. ఆ విషయమై కలిసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆయూబ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్