ధర్మవరం పట్టణంలో సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ధర్మవరం ఆస్పత్రి సూపర్డెంట్ మాధవి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఇంటి పరిసరాలు ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంటిలో ఫినాయిల్ తో ఇంటిని కడగాలని చేతులను పరిశుభ్రంగా ఉంచుకొని ఆహారం తినాలని అన్నారు. అదేవిధంగా దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.