ధర్మవరంలోని రాజేంద్రనగర్ సెక్టార్ పరిధిలో అంగన్వాడి వర్కర్ గా పని చేస్తున్న ఎం.అరుణ అనారోగ్య కారణాలతో బెంగళూరు ఆసుపత్రిలో శుక్రవారం మరణించింది. శనివారం ఆమె మృతదేహాన్ని సిఐటియు ధర్మవరం డివిజన్ కార్యదర్శి జెవి రమణ సందర్శించి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అంగన్వాడి కార్యకర్తలు ఉన్నారు.