
ఏపీలో పింఛన్ తీసుకునే వారికి శుభవార్త
AP: పింఛన్ తీసుకునే వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇతర ప్రాంతాల్లో ఉంటూ ప్రతి నెలా పింఛన్ తీసుకోవడానికి సొంతూరికి వచ్చే వారికి పింఛన్ బదిలీ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతం ఉన్న అడ్రస్‌కు పింఛన్‌ను బదిలీ చేసుకోవచ్చు. దీని కోసం గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. పింఛన్ బదిలీ చేయాలనుకుంటున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.