ధర్మవరం పట్టణంలోని శ్రీదేవి థియేటర్ గాంధీనగర్ ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ధర్మవరం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. శనివారం పరిటాల శ్రీరామ్ మున్సిపల్ అధికారులతో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గాంధీనగర్ శ్రీదేవి థియేటర్ వద్ద డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని, త్వరలో వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.